గ్రామోద్యోగ్ వికాస్ యోజన
అగరబత్తీ తయారీ కళాకారులకు లబ్ధి చేకూర్చేందుకు ‘గ్రామోద్యోగ్ వికాస్ యోజన’ కింద ఓ కార్యక్రమం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టింది.
అగరబత్తీల తయారీ కళాకారుల ప్రయోజనం, గ్రామీణ పరిశ్రమల వృద్ధి కోసం.. ‘గ్రామోద్యోగ్ వికాస్ యోజన’ కింద ఓ కార్యక్రమానికి కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
లక్ష్యం
గ్రామాలు, చిన్న పట్టణాల్లో అగరబత్తీల తయారీని పెంచడానికి ఈ కార్యక్రమం ఉత్ప్రేరకంగా పని చేయడంతోపాటు, తక్షణం 500 అదనపు ఉద్యోగాలను సృష్టిస్తుంది. అగరబత్తీ కళాకారులకు నిరంతరం స్థిరమైన ఉపాధి కల్పించడం, వారి ఆదాయాన్ని వృద్ధి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం
లబ్ది
ఈ కార్యక్రమం కింద మొదట నాలుగు పైలెట్ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిలో ఒకటి ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. ఒక్కో కళాకారుల క్లస్టర్‌కు 50 ఆటోమాటిక్ అగరబత్తి తయారీ యంత్రాలు, 10 మిక్సింగ్ యంత్రాలు అందజేస్తారు. మొత్తం 200 ఆటోమాటిక్ అగరబత్తి తయారీ యంత్రాలు, 40 మిక్సింగ్ యంత్రాలు అందిస్తారు.
దేశీయంగా అగరబత్తీల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు ముఖ్య నిర్ణయాలు తీసుకుంది.
i)దిగుమతుల విధానంలో, అగరబత్తీలను స్వేచ్ఛా వాణిజ్యం నుంచి నియంత్రిత వాణిజ్యానికి మార్చింది.
ii) అగరబత్తీల తయారీకి ఉపయోగించే గుండ్రటి వెదురు పుల్లలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 25 శాతానికి పెంచింది. దీనివల్ల దిగుమతులు తగ్గి, దేశీయంగా అగరబత్తీల తయారీ పెరిగి, గ్రామీణ ఉద్యోగిత వృద్ధి చెందుతుంది. దేశీయంగా అగరబత్తీల ఉత్పత్తి-గిరాకీ మధ్య అంతరాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.
ఈ కార్యక్రమం కింద, "ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్" (కేవీఐసీ) అగరబత్తీ కళాకారులకు శిక్షణ, సాయం, యంత్రాలను అందిస్తుంది. వీరికి ఉత్పత్తి ఆర్డర్లు, ముడిసరుకు అందించేలా ఖాదీ సంస్థలు, అగరబత్తీ తయారీదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది.
Post a Comment
Thsnk You !! We Will Update soon