ఆరోగ్య శ్రీ
ఆరోగ్యశ్రీ అనునది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు.
ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథంకంగా గుర్తింపు పొందింది. ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తారు (వైద్య సేవలందించడంతో పాటు రవాణా, భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తారు.).
వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కు అర్హులు కు నిబంధనలు
1.5 లక్షల కన్నా తక్కువ లేదా అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయంతో అర్హులు.
2.12 ఎకరాల కంటే తక్కువ తడి లేదా 35 ఎకరాల పొడి లేదా మొత్తం 35 ఎకరాలు (తడి & పొడి) కలిగి ఉన్న భూమి.
3.ఒకటి కంటే ఎక్కువ వ్యక్తిగత కారు లేదు
4.ఆస్తి లేని కుటుంబాలు లేదా 3000 అడుగుల కంటే తక్కువ ఉన్న పట్టణ ప్రాంతాలు
5.ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిధిలోకి వస్తారు. అందువల్ల వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు పరిధిలో లేదు.
వైయస్ఆర్ఆరోగ్య శ్రీ విషయం లో వాలంటీర్స్ గుర్తు పెట్టుకొవల్సిన విషయాలు :
వాలంటీర్లు మీ పరిధిలో ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు రాలేదో వారి కోసం దిగువ పెట్టిన వివరాలు మీ వద్ద భద్రపరుచుకోండి.
1. రేషన్ కార్డు నెంబరు/రైస్ కార్డు నెంబర్
2. పేరు
3.ఆధార్ కార్డు నెంబరు
4.లింగం
5. DOB
ఒక ఫ్యామిలీ లో ఎంత మంది ఉంటే అంత మంది యొక్క పేరు ఆధార్ కార్డు నెంబరు లింగము DOB ఉండాలి. ఇవన్నీ మీ డిజిటల్ అసిస్టెంట్ కు ఇస్తే వారు Online అయ్యేటప్పుడు Apply చేస్తారు.
Post a Comment
Thsnk You !! We Will Update soon