Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

YSR Cheyutha



YSR Cheyuta 
వై ఎస్ ఆర్ చేయూత పథకం ద్వారా 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల SC, ST, BC, Minority మహిళలందరికీ ప్రభుత్వము 75 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ప్రతీ సంవత్సరం రూ.18,750 /- రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలు అర్హులైన ప్రతి మహిళ కి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా సహాయము అందుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆగస్టు 12 న వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకం త్వరలోనే అమలు అవుతుంది ఈ పథకం ద్వారా 75,000 రూపాయలు నాలుగు విడతలుగా వచ్చే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు.

ముఖ్య గమనిక : ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే


  

అర్హతలు ఇవి
1. మహిళలు వారి వయసు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వుండాలి SC, ST, BC & MINORITY కులం గల వారు మాత్రమే అర్హులు.

2. వీరిలో వైఎస్సార్ పెన్షన్ తీసుకుంటున్న వారు అనర్హులు.

3.ఆదాయం 10,000 లోపు ఉండాలి.

4.భూమి మాగాణి 3.00 ఏకరాల లోపు మెట్ట 10.00 ఏకరాల లోపు ఉండాలి అదే విధంగా మునిసిపాలిటీ ఏరియా లో ఆస్తి 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి. 

5. కరెంట్ 300 యూనిట్స్ లోపు వుండాలి. 

6. No Income Tax Payee, No Government Employee, No Four Wheeler

7. తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం ( Caste Certificate ) వుండాలి మరియు రాబడి ధృవీకరణ పత్రం ( Income Certificate ) మరియు బ్యాంక్ అకౌంటు కలిగి ఉండాలి.

★ అయితే ఈ పథకానికి అర్హులను గ్రామ వార్డు వాలంటీర్స్ ఈ నెల జూన్ 25 నుంచి జూలై 2 తేదీ వరకు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి గుర్తిస్తారు.

★ కాబట్టి ఎవరికైనా కుల ధృవీకరణ పత్రం ( Caste Certificate ) & రాబడి ధృవీకరణ పత్రం ( Income Certificate ) , బ్యాంక్ అకౌంటు లేకపోతే వెంటనే చేయించుకోండి.


ఈ పథకం షెడ్యూల్ ఇలా ఉంది

» జూన్ 25 - జూలై 2 2020 ; వాలంటీర్స్ అర్హులను సర్వే చేసి గుర్తిస్తారు

» జులై 3 - జులై 9 2020 : సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు  జూలై ఎలిజిబిల్ లిస్ట్ & ఈనెలిజిబిల్ లిస్ట్ పైన

» జులై 10 - జులై 15 2020 : మండల స్థాయి లో MPDO & నగర పంచాయతీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ అర్హులు జాబితాను ఫైల్ చేస్తారు. 

» జులై 16 - జూలై 20 2020 : జిల్లా స్థాయి లో ఎస్సీ ఎస్టీ మరియు బిసి మరియు మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు మరియు జిల్లా కలెక్టర్ అర్హుల జాబితా ను పరిశీలించి సిద్ధం చేస్తారు

» జులై 21 - జులై 23 2020 : జిల్లా కార్పొరేషన్ల నుండి సెర్ప్ ద్వారా అర్హుల జాబితా రావడం జరుగుతుంది

» జులై 24 - జులై 31 2020 : కార్పొరేషన్ వారీగా కావాల్సిన బడ్జెట్ లో వ్యయం చేస్తారు & అర్హుల బ్యాంక్ అకౌంట్ లు వాలిడేషన్ చేస్తారు

» ఆగస్టు 1 - ఆగస్టు 5 2020 : CFMS బిల్లులను తయారు చేస్తారు మరియు ఆ కార్పొరేషన్ల MD ల నుండి ఆ బిల్లులు జారీ చేస్తారు

» ఆగస్టు 12 2020 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంబించి అర్హుల అయిన ప్రతి ఒక్కరికీ 18,750 రూ వారి యొక్క బ్యాంక్ అకౌంటు లో జమ చేస్తారు.


Few FAQ Questions pertaining to YSR Cheyuta 

1.వితంతు లేదా ఒంటరి మహిళ కింద పెన్షన్ తీసుకుంటున్న మహిళా ఈ పథకం కు అర్హురాల? 

Ans: No 

2.భర్త పెన్షన్ తీసుకున్నట్లయితే భార్య 60 ఏళ్ల కి తక్కువ వయసు ఉంటే ఈ పథకం కి అర్హులేనా?

Ans: Yes! 
భర్త వృద్ధాప్య పెన్షన్ లేక వికలాంగ పెన్షన్ తో భార్య కి సంబంధం లేదు. కాబట్టి అర్హురాలు అవుతారు. (కానీ భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఉద్యోగ పెన్షన్ తీసుకుంటే అర్హులు కాదు)

3.తమ పిల్లలు లేదా పేరెంట్స్ ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటే ఆ మహిళ అర్హురాలే నా?

Ans: yes!
 తమ పిల్లల ఒంటరి మహిళ పెన్షన్ లేదా వికలాంగ పెన్షన్ లేదా తమ తల్లిదండ్రుల వృద్ధాప్య పెన్షన్ లేదా ఇతర ఏదైనా BPL పెన్షన్స్ తో మహిళకు సంబంధం లేదు. కాబట్టి మహిళా అర్హురాలు అవుతారు!

ఏ సర్టిఫికెట్స్ కావాల్సి ఉంటుంది?

1. లబ్దిదారుని పేరు 
2. ఆధార్ నంబర్
3. మొబైల్ నంబర్
4. ఇన్కమ్ సర్టిఫికెట్ Income Certificate
5. క్యాస్ట్ సర్టిఫికెట్ Caste Certificate
6. భూమి వివరాలు 
7. వాహనము వివరాలు 
8. మున్సిపాలిటీలో ఉన్న ఆస్తి వివరాలు 
9. కుటుంబంలోని ఉద్యోగస్తుల వివరాలు 
10. బ్యాంక్ అకౌంట్ నెంబర్ 
11. ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ 
12. లబ్దిదారుని యొక్క ఫోటో

అయితే ప్రతి ఏటా 18,750 రూ చొప్పున జమ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 24.19 లక్షల మంది మహిళలకు లబ్ధి నాలుగేళ్లలో మొత్తం 18.142 కోట్లు రూ ఖర్చు అవుతాయని అంచనా

వాలంటీర్స్ అందరూ మీ పరిధిలోని మీ కుటుంబాలలో వై యస్ ఆర్ చేయూత పధకానికి అర్హులైన మహిళల వివరాలను సర్వే చేసి జాగ్రత్తగా పరిశీలించి మీకు ఇవ్వబోయే APP నందు నమోదు చేయాలి.
మీకు ఇవ్వబోయే APP లో ఈ క్రింది వివరములను సేకరించి ఎంటర్ చేయవలెను.




Post a Comment

Thsnk You !! We Will Update soon

Previous Post Next Post