Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

Animal Husbandry kisan credit card

పశువుల కిసాన్ క్రెడిట్ కార్డ్ వివరాలు  




 ఈ కార్డుకి ఎవరు అర్హులు?

ప్రైమినిస్టర్ కిసాన్ సమ్మన్ నిధి నుండి   రైతు భరోసా లో కేంద్ర ప్రభుత్యం నుండి రూ. 6000/- పొందిన రైతులు అందరూ ఈ కార్డుకి  అర్హులు.

ఈ వివరాలు ఎక్కడ లభిస్తాయి ? 

https://pmkisan.gov.in  వెబ్సైట్ లో లభిస్తాయి.  ఈ లిస్టులో ఉన్నవాళ్లు అందరూ అర్హులే. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది లబ్దిదారులే మనకు అర్హతకు వస్తారు.100 రైతులకు అర్హత ఉంటే, 40-50% మంది టౌన్స్ లో వుంటారు కౌలికి ఇచ్చి వాళ్ళను మనం లిస్ట్ చేసుకొని పెట్టుకోవాలి.



వయస్సు
 ఆ లిస్టులో ఉన్న  18 నుండి 75 సంవత్సరాల వయస్సు గల రైతులు అందరూ అర్హులు. 

కావలసిన డాక్యుమెంట్ 
1.ఫోటో
2. పాన్ కార్డ్
3.ఆధార్ కార్డ్.


ఎంత మొత్తం రుణం ఇస్తారు?

 రూ.1,60,000/- ఎటువంటి భూమికి సంబందించిన పత్రాలు లేకుండా.ఆ పై దాటితే భూమికి సంభందించిన పత్రాలు ఉండాలి. 2 ఎకరాల 50 సెంట్స్ కు రూ.2,50,000/-  రుణం ఇస్తారు. గరిష్ట పరిమితి 3 లక్షలు.
ఈ రుణం బ్యాంక్ వారి సూచనల మేరకు 1 సంవత్సరం లో కట్టాలి.

వడ్డీ
వడ్డీ 7% పడుతుంది . (సుమారుగా 25 పైసలు) . రైతు బ్యాంకు వారు సూచించినట్లు 1 సంవత్సరం లో లోను కట్టినట్లు అయితే ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీం ( ISS) కింద నాబార్డ్ లేదా RBI 3% రైతు ఖాతాలోకి వడ్డీ అమౌంట్ repay చేస్తుంది. అలాగే రీ పేమెంట్ prompt గా చేస్తే prompt repayment incentive కింద ప్రభుత్యం వడ్డీ అమౌంట్ లో 3% మరల రైతు ఖాతాలోకి డబ్బు జమ చేస్తుంది.అంటే రైతు   తీసుకొన్న లోన్ సక్రమంగా చెల్లిస్తే మొత్తంగా 1% వడ్డినే కడతారు (5 - 10 పైసలు వడ్డీ) .



కాలపరిమితి
 ఈ కార్డ్ కాలపరిమితి 5 సంవత్సరాలు.  
భీమా
దీనిలో ఇంకా నెలకు 12 రూపాయలు కడితే (5 సంవత్సరాలు) ప్రైమినిస్టర్ స్వంవృద్ది బీమా యోజన క్రింద  ₹2,00,000 ప్రమాద భీమా వర్తిస్తుంది.( మరణానికి మరియు శాశ్వత వైకల్యానికి) .అలాగే  సంవత్సరంనకు ₹ 330/- కడితే (5 సంవత్సరాలు) ప్రైమినిస్టర్ జ్యోతి భీమా క్రింద జీవితకాలం ₹2,00,000/-  ప్రమాద భీమా( మరణానికి మరియు 
శాశ్వత వైకల్యానికి) వర్తిస్తుంది. 

కాబట్టి ప్రాంతీయ పశు వైద్యశాల ,   పరిధిలో గల  పారా సిబ్బంది  AHA  లు మరియు గోపాల మిత్రులు ఒక్కో RBK కి 10 చెప్పున కార్డ్స్ ను ప్రాధమికంగా మంజూరు చేయించండి. ఈ కార్డులో లోన్ తీసుకొన్న రైతుకు చాలా తక్కువగా వడ్డీ పడుతుంది. ఆర్ధికంగా మనం తోడ్పాటు చేసినవాళ్ళం అవుతాము. మన ఉద్యోగ బాధ్యతలను నిర్యార్థించిన వాళ్ళం అవుతాం.  మనము చేయవలసినదంతా రైతును గుర్తించడం, అప్లికేషన్ నింపడానికి కావలసిన పత్రాలను గూర్చి చెప్పడం మరియు ఆ అప్లికేషన్ ఆ రైతు బ్యాంకులో సమర్పించేటట్లు చేయడం తో మన పని ముగుస్తుంది. ఆ   
 రైతుకి ఉన్న అర్హత బట్టి, ఇంతకు ముందు ఏమైనా అప్పులు ఉన్నవా ,ఇతరత్రా విషయాలు బాంక్ వారు చూసి లోన్ మంజూరు చేస్తారు. అప్లికేషన్లో మన Animal Husbandry డిపార్ట్మెంట్ దగ్గర టిక్ చేయాలి లేదా పైన రాయాలి. ఈ లోన్ మొత్తం గేదలు  మరియు ఆవులు కొనేందుకు దాణా, పశుగ్రాసంపెంపకం మరియు ఇతర యాజమాన్య ఖర్చులకు అని తెలుపగలరు.

Post a Comment

Thsnk You !! We Will Update soon

Previous Post Next Post