10days లో రేషన్ కార్డ్ guideliness
1.కుటుంబానికి మూడు ఎకరాల మాగాణి లేదా 10ఎకరాల మెట్ట లేదా మాగాణి, మెట్ట కలిపి 10ఎకరాలను మించి ఉండకూడదు. విచారణకు రెవెన్యూశాఖ నుంచి ధ్రువీకరణ పత్రాలుండాలి.
2.కుటుంబంలో ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ మినహా ఇతర నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. విచారణకు వాహనం ఆర్ సీపత్రం, లేకుంటే సేల్ లెటర్ జత చేయాలి.
3.ప్రభుత్వ ఉద్యోగి కానీ, విరమణ పెన్షనర్ కానీ అయి ఉండకూడదు.
4.కుటుంబ విద్యుత్ వాడకం నెలసరి 300 యూనిట్లకు మించి ఉండకూడదు. ఉమ్మడి మీటర్ అయితే ఎన్ని కుటుంబాలకు కలిపి మీటర్ ఉంది. అన్ని కుటుంబాలు నెలసరి యూనిట్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇల్లు, చిన్న వ్యాపారం కలిపి వినియోగిస్తున్నారా.. కేవలం వ్యాపారం కోసం వినియోగిస్తున్నారా.. అనేది విచారణ చేస్తారు.
5.కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు ఆదాయపు పన్నుదారు అయినా ఆర్టీజీఎస్ డేటా ద్వారా విచారణ చేస్తారు.
Application process
1.కొత్త రేషన్ కార్డు కోసం వలంటీర్ ద్వారా దరఖాస్తును పూర్తి చేసి ఇవ్వాలి. వలంటీర్ ఆ దరఖాస్తును సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ కు ఇస్తే ఆన్లైన్లో నమోదు చేస్తారు.
2.వివాహమైన మహిళ పేరును భర్త కుటుంబంలోని రేషన్ కార్డులో నమోదు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. అయితే గతంలో రేషన్ కార్డులో ఉన్న ఆమె పేరును తొలగించాల్సి ఉంది.
3.భార్య పేరుతో కార్డు ఉంటే భర్తను ఆ కార్డులో కొత్తగా నమోదు చేయడం లేదు. పిల్లలను కార్డులో చేర్చాలంటే జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ తప్పనిసరి. వలంటీర్ ద్వారా ఈకేవైసీ చేయించాలి. అప్పుడే మార్పులు, చేర్పులు సాధ్యం. పేరు తొలగింపు విషయానికి వస్తే ప్రస్తుతానికి చనిపోయిన వారిని మాత్రమే కార్డుల నుంచి తొలగిస్తున్నారు.*
రేషన్ కార్డుకు సంబంధించిన ఏ ఇతర సమస్య ఉన్నా ఆయా సచివాలయంలోని ఉద్యోగులను సంప్రదించి పరిష్కారం పొందవచ్చు.
Post a Comment
Thsnk You !! We Will Update soon