కరోనా నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఆపన్న హస్తం
కరోనా సందర్భంగా పేద ప్రజలను ఆదుకునేందుకు గరీబ్ కళ్యాణ్ యోజన ను ప్రకటించినందుకు ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు. గరీబ్ కళ్యాణ్ పథకంలో భాగంగా 80 కోట్ల మంది పేదలకు కేంద్రం 1 లక్ష 70 వేల కోట్ల రూపాయల లాభాలను అందిస్తుంది.
1. రానున్న 3 నెలలలు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల బియ్యం
2. 8.69 కోట్ల మంది రైతులకు తక్షణమే రూ 2,000
3. పెన్షనర్లకు, పేదలకు, వృద్ధులకు, దివ్యాన్గులకు, భర్త లేని వారికి రూ 1,000
4. జన్ ధన్ ఖాతా ఉన్న మహిళలకు రాబోయే మూడు నెలలు పాటు నెలకు రూ 500
5. ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి 3 నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ
6. వైద్యులకు, ఆశ వర్కర్లకు, పారిశుధ్య కార్మికులకు 50 లక్షల భీమా
7. ఉపాధి హామీ కూలీని రూ 182 నుండి రూ 202 లకు పెంపు
8. స్వయం సేవక మహిళా గ్రూపులకు ఇచ్చే రుణాన్ని 10 లక్షల నుండి 20 లక్షలకు పెంపు
9. 100 మంది కంటే తక్కువ ఉన్న కంపెనీల్లో పని చేసే వారికి యాజమాన్యం ఇచ్చే పిఎఫ్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది
10. ఉద్యోగస్తులు 75 శాతం పిఎఫ్ ను విత్డ్రా చేసుకునే వెసలుబాటు
Post a Comment
Thsnk You !! We Will Update soon